శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (11:32 IST)

ఆయనది విశిష్ట వ్యక్తిత్వం : పవన్‌పై చంద్రబాబు ప్రశంసలు

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. ఆయన్ను అభినందించారు. తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని పవన్ కల్యాణ్ సంపాదించారని చంద్రబాబు ప్రశంసించారు. 
 
విశిష్ట వ్యక్తిత్వంతో ఆయన ప్రజల పక్షాన నిలిచి సేవలు అందిస్తున్నారని కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ నిండు నూరేళ్లు, ఆనందారోగ్యాలతో వర్థిల్లాలని కొరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
 
మరోవైపు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా పవన్ పుట్టినరోజు నేపథ్యంలో జససేన పార్టీ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ‘అడుగొక్కటి వెనుకపడితే నీ చరిత్ర ముగుస్తుందా. నీ ఆశయ సిద్ధాంతపు సెగ మంటను దహిస్తుందా. నీ పుట్టుక జాతి కొరకు. నీ మనుగడ నీతి కొరకు. భరతమాత ముద్దుబిడ్డ.. నీ పయనం ప్రజల కొరకు’ అంటూ సాగుతున్న పాట అదరగొట్టేస్తోంది. ఈ వీడియోను మీరూ తిలకించండి.