షిర్డీలో వైవీ పూజలు... ఎందుకు?

yv subbareddy in shirdi
ఎం| Last Updated: సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:20 IST)
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆదివారం మధ్యాహ్నం షిర్డీ సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ట్రస్టులో భోంచేసి అక్కడ నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి చేపడుతున్న చర్యలను స్వయం పరిశీలించారు.

తెలుగు రాష్ట్రాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుతూ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
దీనిపై మరింత చదవండి :