నెల్లూరు మెస్ లో టిక్కెట్లు అమ్ముకునే బాగోతం.. గంటాపై అవంతి ఆగ్రహం

avanthi srinivas
ఎం| Last Updated: సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:31 IST)
నెల్లూరు మెస్ లో టిక్కెట్లు అమ్ముకునే బాగోతం గంటాది అని తెలుగుదేశం నేత గంటా శ్రీనివాస రావు పై టూరిజంశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు.

"నన్ను మంత్రి కాదన్న గంటా శ్రీనివాసరావు నిజంగా మనిషేనా అని ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడుని అణగదొక్కేందుకు వచ్చిన గంట శ్రీనివాసరావు. అయ్యన్నపాత్రుడు అంత మంచి వాడిని కాను. నా జోలికి వస్తే విశాఖలో ఉండకుండా చేసే శక్తి నాకుంది.

నాతో పెట్టుకోవద్దు. గంటా నెల్లూరు మెస్ లో టికెట్లు అమ్ముకునే బాగోతం నాకు తెలుసు. నేను నోరు తెరిస్తే నీ బండారం బయట పెడతా. విజయనగరం జిల్లా ఇన్చార్జి గా ఉండి ఏమి సాధించావు? ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేక పోయావు.

నిన్ను చంద్రబాబు నాయుడు పార్టీ లో ఉంచుకోవడం పెద్ద తప్పు. రేపు చంద్రబాబుకి సున్నం రాసి స్థాయి నీది. నీ చరిత్ర భూకబ్జా కోరు చరిత్ర. నీలాంటి దొంగని జగన్మోహన్రెడ్డి ఏనాడు పార్టీలో తీసుకోడు. నీ లాంటి వాడిని తీసుకొని వైఎస్ఆర్సీపీ పరువు తీసే స్థాయిలో జగన్మోహన్రెడ్డి లేరు. జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడే స్థాయి గంటా శ్రీనివాసరావుది కాదు.

వర్గ రాజకీయాలు గ్రూపు రాజకీయాలు చేస్తే చరిత్ర గంటది. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఓపెన్ చాలెంజ్ విసిరాను చంద్రబాబు వస్తారా, లోకేష్ వస్తారా, గంట వస్తారా నాపై పోటీకి అని. రాజకీయాన్ని వ్యాపారంగా వాడుకునే వారు ఎవరైనా
ఉంటారంటే ఆయన గంటా శ్రీనివాసరావు" అని విమర్శించారు.
దీనిపై మరింత చదవండి :