1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. School Building Collpase in Paderu, Vizag Dist

పాడేరులో కుప్పకూలిన స్కూల్ భవనం .. తప్పిన విపత్తు

Vizag
ఏపీలోని విశాఖపట్టణం జిల్లా పాడేరులో పెను ప్రమాదం తప్పింది. గులాబ్ తుఫాను ప్రభావం కారణంగా ఈ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొట్లగరువులో పాఠశాల భవనం కూలిపోయింది. 
 
పాడేరు మండలం కోట్లగరువులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పాఠశాల భవనం కూలింది. కాగా విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు. 
తర్వాతి కథనం
సామినేని ఉదయభాను మరో వంగవీటి మోహనరంగా అవుతారని భయం!