శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (14:29 IST)

సామినేని ఉదయభాను మరో వంగవీటి మోహనరంగా అవుతారని భయం!

సీఎం‌ జగన్ పరిపాలన చూసి టీడీపీ నేతలు కంగారుపడుతున్నార‌ని, అందుకే కులాల మధ్య చిచ్చు పెడుతున్నార‌ని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమ‌ర్శించారు. చంద్రబాబులాగా కులాల మధ్య చిచ్చుపెట్టే పనులు సీఎం జగన్ చేయలేద‌న్నారు. విజ‌య‌వాడ‌లో అడ‌పా శేషు మీడియాతో మాట్లాడుతూ, సామినేని ఉదయభాను మంత్రి అవుతారేమో అని భయంతో ఆయన కుమారుడిపై రూమర్లు సృష్టిస్తున్నార‌ని అన్నారు. 
 
కాపు కమ్యూనిటీలో సామినేని ఉదయభాను మరో వంగవీటి మోహనరంగా అవుతారని భయపడుతున్నార‌ని అడ‌పా శేషు వ్యాఖ్యానించారు. పట్టాభి వాగ్ధాటితో భయపెట్టాలని చూస్తే సహించం అని హెచ్చ‌రించారు. పవన్ కళ్యాణ్ ద్వారా కాపులను విడదీసే కార్యక్రమం చేస్తున్నార‌ని, కులాన్ని భ్రష్టు పట్టించద్దని అందరినీ వేడుకుంటున్నాన‌ని అడ‌పా శేషు విజ్నప్తి చేశారు. 
 
లోకేష్ అమ్మాయిలతో ఉండి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు విజువల్స్ ఉన్నాయ‌ని, సామినేని ఉదయభానుపై రూమర్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ కి లెటర్ ఇస్తామ‌ని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు కాపులను దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలని వినతి అన్నారు. కాపులు ఎక్కడ సీఎం జగన్ కు దగ్గర అవుతారో అనే భయంతో పవన్ కళ్యాణ్ ను ఉసిగొల్పుతున్నార‌ని, కాపులను రెచ్చగొడితే పట్టాభిలాంటి వారు రోడ్లపై తిరగలేర‌ని చెప్పారు. తాము కాపు కార్పొరేషన్ కు 13వేల కోట్లు ఖర్చుపెట్టామ‌ని, నవంబరు నుంచీ కాపు కార్పొరేషన్ యాక్టివ్ గా పని చేస్తుంద‌ని అడ‌పా శేషు చెప్పారు.