1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (11:51 IST)

దివ్యాంగురాలిపై అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అత్యాచార ఘటన జరిగింది. ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగింది. ఆ దివ్యాంగురాలి నోట్లో గుడ్డలు కుక్కి ఈ దారుణానికి పాల్పడ్డారు. విశాఖపట్నంలో ఈ దారుణం జరిగింది. 
 
దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై అత్యాచారం జరిగిందంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు స్థానిక వైసీపీ నాయకుడు వెంకట్రావు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
ఈ దారుణానికి పాల్పడింది కూడా అధికార వైకాపాకు చెందిన నేతే కావడం గమనార్హం. అతన్ని వెంకట్రావుగా గుర్తించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, ఏపీలో మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక ప్రాంతంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితులను కటినంగా శిక్షిస్తున్నా దిశ వంటి యాప్‌లు తీసుకువచ్చి నిఘా పెంచిన మహిళలపై అరాచకాలు మాత్రం తగ్గటం లేదు. దీంతో మహిళలు బయట కాలుపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు.