గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (15:16 IST)

ఏపీ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సోమవారం సమావేశమయ్యారు. ఇందుకోసం ఏపీ సినీ ప్రముఖులు ఏపీ సచివాలయానికి ఇప్పటికే చేరుకున్నారు. 
 
ముఖ్యంగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ సర్కారు ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు వీలుగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు, ఎక్జిబిటర్‌లు సోమవారం ఉదయం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. 
 
ముఖ్యంగా, ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ విధానంపై సినీ ప్రముఖులు తమ వైఖరిని ప్రభుత్వానికి స్పష్టంచేయనున్నారు. ప్రభుత్వంతో సమావేశానికి ముందు 13 జిల్లాల ప్రొడ్యూసర్‌లు డిస్ట్రిబ్యూటర్‌లు, ఎక్జిబిటర్లు విజయవాడలో భేటి అయ్యారు. 
 
ప్రభుత్వం తీసుకున్న ఆన్‌లైన్ విధానానికి మద్దతు తెలుపుతూనే తమకు ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వానికి ప్రతినిధులు తెలుపనున్నారు. ఇందులో అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, డివివి దానయ్య, సి.కళ్యాణ్, అదిశేషగిరావు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మంత్రి పేర్ని నాని తదితరులు సమావేశానికి హాజరయ్యారు.