శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:18 IST)

హీరోయిన్ నందితా శ్వేత తండ్రి హఠాన్మరణం

హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి శివస్వామి ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయసు 54 యేళ్లు. ఈయన ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. 
 
ఈ విష‌యాన్ని నందిత త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. 'నా తండ్రి శివ స్వామి 54 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషుల‌కి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాను' అని నందిత త‌న ట్విట్‌లో పేర్కొంది. 
 
నందిత తండ్రి ఇక లేర‌ని తెలుసుకున్న ప్ర‌ముఖులు ఆయ‌న‌కు సంతాపం తెలియ‌జేస్తూ, కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. కన్నడ చిత్రం 'నంద లవ్స్ నందిత' చిత్రంతో నందిత తన నట జీవితాన్ని ప్రారంభించింది. 
 
ఇప్పుడు క‌థానాయిక‌గా ప‌లు భాష‌ల‌లో న‌టిస్తూ, లేడి ఓరియెంటెడ్ సినిమాల‌లోను న‌టిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఈమె మరో యువ నటి ఐశ్వర్యా రాజేశ్‌కు బెస్ట్ ఫ్రెండ్. ఆమె కూడా నందితా శ్వేతను ఓదార్చారు.