దేవీశ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాద ఘటనలు, ఒకేసారి ఇద్దరు మృతి
తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడుగా ఉన్న దేవీశ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బుల్గానిన్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో డీఎస్పీ బాబాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ మృతి వార్త నుంచి తేరుకోకాగానే దేవిశ్రీ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. దేవిశ్రీ బాబాయి బుల్గానిన్ మరణ వార్త విని దేవిశ్రీ ప్రసాద్ మేనత్త సీతా మహాలక్ష్మీ గుండెపోటుతో మరణించారు. దాంతో వరుస మరణ వార్తల కారణంగా అతడి కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయింది.
కాగా దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్‌లో వస్తున్న 'క్రేజీ బాయ్స్' సినిమాకు కూడా స్వరాలు సమకూరుస్తున్నాడు. మరోవైపు ఇప్పటివరకు దేవిశ్రీ, బన్నీ, సుక్కు కాంబోలో తెరకెక్కిన ఆర్య, ఆర్య 2 సినిమాలకు స్వరాలు సమకూర్చగా.. ఈ రెండు సినిమాల పాటలు కూడా ఎంతో ఆకట్టుకున్నాయి.