గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:49 IST)

టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈడీ ముందుకు నటుడు తనీష్

తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందుకు నటుడు తనీష్ వచ్చారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ముమైత్ ఖాన్, నవదీప్ వంటి వారు విచారణకు హాజరయ్యారు. వీరివద్ద అనేక గంటల పాటు ఈడీ అధికారులు విచారణ జరిపారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం న‌టుడు త‌నీష్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి అధికారులు ఆరా తీశారు. అలాగే డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు? ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? డ్ర‌గ్స్ ఎప్పుడైన తీసుకున్నారా? అనే విష‌యాల‌పై ఆయ‌న‌ను ప్ర‌శ్నించినట్టు సమాచారం. 
 
అయితే విచార‌ణ‌కు వెళ్ల‌బోయే ముందు మీడియాతో మాట్లాడిన తనీష్‌.. త‌న‌కు కెల్విన్ అనే వ్య‌క్తితో ఎలాంటి పరిచ‌యాలు లేవ‌ని చెప్పారు. ఈడీ విచార‌ణ‌కు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.