సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:46 IST)

డెంగ్యూ ఫీవర్ బారినపడిన యువ హీరో

తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ జ్వరాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వణుకు పుట్టిస్తోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు కూడా డెంగ్యూ బారినప‌డుతున్నారు. తాజాగా యువ హీరో అడివి శేష్ డెంగ్యూ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. 
 
గత కొన్ని రోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయనకు గతవారం ప్లేట్ లెట్స్ సడెన్‌గా పడిపోవడంతో .. ఈ నెల 18న ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్ర‌త్యేక వైద్య బృందం అడివి శేష్‌కి వైద్యం అందిస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం అడివి శేష్ "26/11 ముంబై టెర్రర్ అటాక్"లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజ‌ర్' అనే సినిమా చేస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్ల‌స్ ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో శోభితా ధూళిపాల హీరోయిన్.