ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (19:02 IST)

స్పృహలోకి వచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చారు. గత శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన తేజ్ ఆరోగ్య పరిస్థితి వివరాలను అపోలో హాస్పటల్ బులిటిన్ విడుదల చేసారు. బులిటిన్ ప్రకారం.. తేజు స్పృహలోకి వచ్చారని.. వెంటిలేటర్‌ను తొలగించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు.

తేజ్ ఆరోగ్యం నిలకడగా ఖంగారు పడాల్సిన అవసరం లేదని, మరికొన్ని రోజుల పాటు తేజ్ హాస్పిటల్‌లోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నట్లు.. తనంతట తానే శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
 
గత వారం మాదాపూర్‏లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్‌పై నుంచి ఐకియా వైపుగా గచ్చిబౌలి వెళుతోన్న సమయంలో తేజ్‌ ప్రయాణిస్తోన్న స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అవ్వడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు.

దీంతో వెంటనే ఆయనను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను జూబ్లీ హిల్స్‏లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తేజు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. షోల్డర్‌ బోన్‌ సర్జరీ చేసిన వైద్యులు ఆయనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు