1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Simhachalam temple Dress Code mandatory from November 6th

సింహాచలం ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ తప్పనిసరి

simhachalam temple
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వారహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులకు నూతన వస్త్ర నిబంధనలు (డ్రెస్ కోడ్) అమల్లోకి తెచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇకపై తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని దేవస్థానం కార్వనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు స్పష్టం చేశారు.
 
ఈ కొత్త డ్రెస్ కోడ్ ప్రకారం పురుషులు పంచె - కండువా లేదా కుర్తా పైజామా తప్పనిసరిగా ధరించాలి. ఫార్మెల్ ప్యాంట్, షర్ట్ ధరించిన వారిని కూడా అనుమతిస్తారు. మహిళలు చీర, లంగా - ఓణీ లేదా చుడిదార్‌తో పాటు తప్పనిసరిగా దుపట్టా ధరించాల్సివుంటుంది. షార్ట్స్ (నిక్కర్లు), టీషర్టులు, స్లీవ్‌లెస్ టాప్స్ వంటి ఆధునిక పాశ్చాత్య దుస్తులు ధరించిన వారిని ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేసారు. ఆర్జిత సేవల్లే పాల్గొనే భక్తులకు సైతం ఈ నిబంధనలే వర్తిస్తాయని అధికారులు తెలిపారు. 
 
ఆలయ పవిత్రతతు కాపాడటంతో పాటు సనాతన ధర్మ సంప్రదాయాలను పరిరక్షించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈవో వెంకట్రావు తెలిపారు. ఈ కొత్త నిబంధనలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 
 
మరోవైపు, నవంబరు 8వ ఆదివారం చతుర్ధశి, స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్విహిస్తామని, ఆ రోజున సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
MPTC, ZPTC election results: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం