సంబంధిత వార్తలు
- స్వామి క్షమించు, తిరుమలకు మందుబాటిళ్ళు, మాంసం ఎలా తీసుకెళుతున్నారో తెలుసా?
- "పుష్ప" కోసం ఫోక్ సాంగ్స్‌పై దృష్టిపెట్టిన 'లెక్కల మాస్టారు'
- మద్యం షాపులు తెరిచారు, పూటుగా తాగొచ్చి కొడుకుని పొట్టనబెట్టుకున్నాడు
- ధోనీకి కూడా కోపం వస్తుంది.. వచ్చిందంటే భయంకరంగా వుంటుంది..
- కరోనా దెబ్బకు బెంబేలు - ఖైదీలను విడుదల చేయనున్న మహారాష్ట్ర
బ్యాంకులో వున్న డబ్బు తీసివ్వలేదని తల్లిదండ్రులను చితకబాదాడు
డబ్బు కోసం ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్న ఈ కాలంలో తల్లిదండ్రులకు కూడా ముప్పు తప్పడం లేదు. డబ్బు కోసం కన్న కొడుకు తల్లిదండ్రులను చితకబాదాడు. ప్రక్క వారికి ఉన్న కనికరం కూడా అతనికి లేకపోయింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన నక్కా రంగయ్య దంపతులు ఐదు లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. డబ్బు తెచ్చివ్వమని కొడుకు వారితో ఇప్పటికే చాలాసార్లు గొడవపడ్డాడు. ఇదేవిధంగా మరోమారు వేధించసాగాడు. ఆ వృద్ధులు దాని ఒప్పుకోకపోవడంతో పైశాచికంగా ప్రవర్తించాడు.
కర్ర తీసుకుని చితకబాదాడు. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఈ విషయం తెలియడంతో దారుణానికి దిగిన కొడుకుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
