శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 14 మే 2020 (14:10 IST)

స్వామి క్షమించు, తిరుమలకు మందుబాటిళ్ళు, మాంసం ఎలా తీసుకెళుతున్నారో తెలుసా?

అతనో ప్రముఖ మీడియా ఛానల్ కెమెరామెన్.. తిరుపతి, తిరుమలలో కెమెరామన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పదిమందికి మంచి చెప్పాల్సిన ఆ కెమెరామెన్ నిషేధిత వస్తువులను తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అది కూడా ఎక్కడో కాదు సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలకు. 
 
గత నాలుగురోజుల నుంచి తిరుపతికి చెందిన మీడియా ఛానల్ కెమెరామెన్ వ్యక్తి విధులు నిమిత్తం తిరుమలకు వెళుతున్నట్లు ప్రతిరోజు కారులో వెళుతూ ఉండేవాడు. అనుమానం వచ్చిన టిటిడి సెక్యూరిటీ అధికారులు అతడిని, కారును చెక్ చేశారు. అయితే కారులో నిషేధిత వస్తువులు ఉండటాన్ని గుర్తించారు. 
 
కారు వెనుక సీటు కింద 10 ఫుల్లు బాటిళ్ళు, 10 కిలోలపైన చికెన్ కనిపించాయి. కారు సీటు వెనుక ఏ విధంగా అనుమానం రాకుండా వీటిని జాగ్రత్తపరిచాడు. అయితే టిటిడి విజిలెన్స్ అధికారులు కారు మొత్తాన్ని పరిశీలించగా అందులో మద్యం, మాంసం కనిపించాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లను అధిక రేట్లకు విక్రయించిన కేసులో కూడా ఇదే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. మీడియా ప్రతినిధిగా ఉన్న వ్యక్తే ఇలా చేయడంపై చర్చ నడుస్తోంది.