శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: బుధవారం, 13 మే 2020 (17:56 IST)

మందుబాబులకు మద్యం డోర్ డెలివరీ, ఇక తూలుతూ క్యూలో ఎందుకూ?

కరోనా దెబ్బతో మందుబాబులకు మందు కరువైంది, లేకలేక మందుషాపులు తెరిస్తే, వారు కోరుకున్నది ఉంటుందో లేదో, ఎంత రేటు ఉంటుందేమో, వంటి పలు ఆందోళనలు. మరో ప్రక్క కరోనా భయం పట్టి పీడిస్తోంది. హడావుడిలో పడి సోషల్ డిస్టెన్స్‌ని, కనీస జాగ్రత్తలను మరిచిపోతున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి కొన్ని రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి. 
 
డోర్ డెలివరీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, పంజాబ్, బెంగాల్‌లో ఈ విధానం అమలులో ఉంది. ఆ రాష్ట్రాల్లో ఇది సక్సెస్ అవడంతో మిగతా రాష్ట్రాలు కూడా దానినే అనుసరించాలని భావిస్తున్నాయి. ప్లాన్‌లు కూడా సిద్ధం చేస్తున్నాయి. దేశంలో జనానికి సరిపడా మొత్తంలో మద్యం దుకాణాలు లేవు కాబట్టి డోర్ డెలివరీయే ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
వచ్చే రెండు వారాల తర్వాత దాదాపు 7 నుండి 8 రాష్ట్రాల్లో ఈ డోర్ డెలివరీ రాబోతున్నట్లు తెలిసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇప్పటికే ప్లాన్‌లు రెడీ చేసే పనిలో పడ్డాయి. మహారాష్ట్రలో రెడ్ జోన్ ప్రాంతాల్లో లిక్కర్ అమ్ముతుండటంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే ఢిల్లీలో లిక్కర్ పై కరోనా సెస్ పేరుతో 70 శాతం గుంజడంపై తీవ్ర విమర్శలొచ్చాయి.