శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మే 2020 (15:04 IST)

తమిళనాడు సర్కారుకు వార్నింగ్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ!

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గట్టివార్నింగ్ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో మద్యం విక్రయాలు వద్దనీ, తక్షణం మద్యం దుకాణాలను మూసివేయాలంటూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై ప్రభుత్వం అప్పీల్ చేసింది. 
 
ఈ విషయంపై అనేక మంది సెలెబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టవేయలేని ఈ సర్కారుకు మద్యం విక్రయాలు అంత ముఖ్యమా అంటూ నిలదీస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలన్న ఆలోచనను మానుకోవాలని సూచించారు. ఒకవేళ మద్యం దుకాణాలు తెరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామన్న ఆశలు వదులుకోవాల్సిందేనని అధికార పార్టీపై వ్యాఖ్యలు చేశారు. ఆదాయ మార్గాల కోసం ఇతర మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు.
 
కాగా, తమిళనాడులో మద్యం దుకాణాలను మూసివేయాలంటూ ప్రభుత్వానికి రెండు రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి దీనిపై స్టే కోరుతూ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆన్‍లైన్ ద్వారా మద్యం విక్రయించడం, డోర్ డెలివరి చేయడం సాధ్యం కాదని తన పిటిషన్‌లో పళనిస్వామి తెలిపారు.