ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (20:03 IST)

తమిళనాడులో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు.. ఒక్క రోజే 600 కేసులు

తమిళనాడులో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 600 కరోనా కేసులు నమోదైనాయి. ఇందులో చెన్నై నగరంలోనే 399 కేసులు నమోదు అయ్యాయని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్‌ వెల్లడించారు. దీంతో మొత్తంగా రాష్ట్రంలో 5409 కరోనా కేసులు నమోదవగా, 37 మంది మరణించారని తెలిపారు. 
 
ప్రస్తుతం 3825 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, మరో 1547 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నా..మృతుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 
 
త్వరలోనే కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే.. రోజూ వందల సంఖ్యలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.