బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (16:08 IST)

బెజవాడలో అమ్మాయిల యుద్ధం.... ఏం చేసారో చూడండి

Girls
Girls
విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు జుట్టుపట్టుకుని జగడానికి దిగిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డు మీద నలుగురూ చూస్తున్నా జుట్లు పట్టుకుని బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది. 
 
వన్ టైన్‌లోని కేబీఎన్ కాలేజీ సమీపంలో గేటు బయట ఈ ఘటన జరిగింది. కారణమేంటో తెలియదుగానీ.. ఆ ఇద్దరు మాత్రం పిడిగుద్దులతో కొట్టుకున్నారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయిపోయింది.