గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:40 IST)

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు

chandrababu
విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇందుకోసం ఆస్పత్రికి వచ్చిన చంద్రబాబును పోలీసులు బాధితురాలి వద్దకు తీసుకెళ్ళారు. చంద్రబాబు రాక సందర్భంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
మరోవైపు, బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర హమిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మను టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేసారు. 
 
అత్యాచార బాధితురాలిని పరామర్శించి వెళ్లిపోతానని వారికి నచ్చచెప్పారు. చివరకు పోలీసు సాయంతో ఆమె బాధితురాలి వద్దకు వెళ్లారు. అయితే, టీడీపీ మహిళా కార్యకర్తలు మాత్రం ఆస్పత్రి వద్దే బైఠాయించారు.