1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TDP Jyothula Nehru About State Honour to Mudragada Padmanabha

ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య : జ్యోతుల నెహ్రూ

jyothula nehru
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భావించింది. అయితే, వైకాపా నేతలు మాత్రం ఆ అంత్యక్రియల్లో అతిగా ప్రవర్తించారు. దీనిపై జగ్గంపేటకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో వైకాపా నాయకులు అనుసరించిన తీరు అత్యంత హేయమని, ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. 
 
'ముద్రగడతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మచ్చలేని మహానాయకుడిగా రాజకీయాల్లో ఆయన ఎదిగారు. అయితే ఎప్పటికప్పుడు స్వీయ శిక్ష వేసుకోవడం ద్వారా అనేక అవకాశాలు జారవిడుచుకున్నారు. కాపుల ఉన్నతికి, రిజర్వేషన్లకు అలుపెరుగని పోరాటం చేశారు. వైకాపా నాయకులు తమ స్వలాభం కోసమే ముద్రగడ అంత్యక్రియల సమయంలో పథకం ప్రకారమే వ్యవహరించారు. పద్మనాభం కుటుంబ సభ్యులను సంప్రదించకుండా వైకాపా నాయకులే నిర్ణయాలు తీసుకుని గందరగోళం సృష్టించారు' అని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
co-living తంటా, ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి, పెళ్లి చేసేసిన పెద్దలు