సంబంధిత వార్తలు
- చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలి: ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
- విద్యార్థులకు శుభవార్త.. ఏపీలో సంక్రాంతి సెలవులు పొడగింపు
- ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో భారీ కొండ చిలువ
- చంద్రబాబు గుండె సమస్యతో బాధపడుతున్నారు : హైకోర్టుకు వైద్యుల నివేదిక
- "ఏపీ హేట్స్ జగన్" అని ఇందుకే అంటున్నాం.. ఇప్పటికైనా అర్థమైందా? గంటా శ్రీనివాస రావు
విద్యార్థులకు అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వ పరీక్షల విభాగం
ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్థులకు అలెర్ట్ ప్రకటించింది. వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్ 17వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి వుంటుంది. కానీ గడువు సమయం దగ్గర పడిన నేపథ్యంలో సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది.
పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజును డిసెంబర్ 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ఈ మేరకు ప్రకటను విడుదల చేసింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఇక రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 3 వరకు చెల్లించవచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది - 03.01.2024.
