గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (15:36 IST)

"ఏపీ హేట్స్ జగన్" అని ఇందుకే అంటున్నాం.. ఇప్పటికైనా అర్థమైందా? గంటా శ్రీనివాస రావు

aphates jagan
"ఏపీ హేట్స్ జగన్" అని ఎందుకు అంటున్నామో వివరిస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాలుగేళ్ళ 8 నెలల కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఘన కార్యాలు ఇవేనంటూ ఆయన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
అమరావతి, మూడు రాజధానులు, కరెట్ కోతలు, ప్రజా వేదిక కూల్చివేత, రుషికొండకు బోడిగుండి కొట్టడం వంటి ఇత్యాది పనులను ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. ఏపీ హేట్స్ జగన్ అని రాష్ట్ర ప్రజలు ఎందుకు అంటున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫోటో సరిపోతుందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేశారు. 
 
ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో మీ ఘన కార్యాలు ఇవేనని పేర్కొన్నారు. ఆ ఫోటోలో ప్రజా వేదిక విధ్వంసం, రాజధాని లేకపోవడం, రుషికొండపై తవ్వకాలు, పెట్రోలు బాదుడు, మూడు రాజధానులు, మైనింగ్, గంజాయి, తరలిపోయిన పరిశ్రమలు, కరెంట్ కోతలు అంటూ పలు విషయాలను ప్రస్తావిచారు. వద్దు వద్దు జగన్.. మళ్లీ మాకొద్దీ జగన్ అని ప్రజలు ఎందుకు అంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ గారూ అంటూ గంటా శ్రీనివాసరావు కామెంట్ చేశారు.