గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (16:53 IST)

ఏపీ మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు... అవేంటంటే...

jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం ఏకంగా నాలుగు గంటల పాటు జరిగింది. ఏపీ సచివాలయ మొదటి బ్లాక్‌లో మంత్రివర్గం సమావేశంకాగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఏపీలో సమగ్ర కులగణనపై ఇందులో చర్చించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు మంత్రివర్గం సానుకూలంగా స్పందించింది. నవంబరు 15వ తేదీ నుంచి ఈ కల గణన చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, ఏపీ మంత్రివర్గం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను పరిశీలిస్తే, 
 
ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ, ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్డర్ డ్రాఫ్ట్ 2023కు ఆమోదం.
ఆర్ అండ్ బి డిపార్ట్‌మెంట్‌లో 467 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ.
6790 పాఠశాలల్లో భవిష్యత్ నైపుణ్యాలపై బోధన.
ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల మినహాయింపు. 
వ్యవసాయ సహకార శాఖకు రూ.5 వేల కోట్లకు గ్యారెంటీతో మార్క్ ఫెడ్ ద్వారా రుణం
జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమోదం. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు ఆరోగ్య శ్రీపై అవగాహన కార్యక్రమం.