1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (11:22 IST)

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 3041 సార్లు వాయిదానా? విస్తుపోయిన సుప్రీం జడ్జిలు??

New districts in Andhra Pradesh
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న 11 అక్రమాస్తుల కేసుల విచారణ 3041 సార్లు వాయిదా పడటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు జాప్యం అవుతుందో వెల్లడించాలంటూ సీబీఐను ఆదేశించింది. 
 
సీఎం జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జరగడంపై వైకాపాకు చెందిన రెబెల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలంటూ ఆదేశిస్తూ, సీబీఐతో పాటు ప్రతివాదులకు కూడా నోటీసులు జారీచేసింది. 
 
వీరిలో జగన్, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, అరబిందో, హెటిరో గ్రూప్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం.శ్రీనివాస రెడ్డి, కె.నిత్యానంద రెడ్డి, పి.శరత్‌శ్చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి, పీఎస్ చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు నోటీసు జారీచేసింది. ఆ తర్వాత తదుపరి విచారణను సుప్రీంకోర్టు తేదీని వెల్లడించకుండా జనవరికి వాయిదా వేసింది. 
 
కాగా, జగన్‌పై దాఖలై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ పదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయని, అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. 'సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదాపడ్డాయి. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు. దీనివల్ల ఈ కేసుల విచారణకు అంతులేకుండా పోతోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదు. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి' అని కోరారు.