15 నుంచి ఏపీలో కులగణన - రెండు రోజుల ప్రయోగం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని నిర్ణయించింది. తొలుత రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అధికారులు ఈ కులగణన చేపట్టనున్నారు. ఇందుకోసం ఐదు పట్టణాలలో ప్రాంతీయ సదస్సులను కూడా నిర్వహించారు.
బుధవారం నుంచి జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ఐదు పట్టణాలలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం మేరకు ఈ నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో కులగణన చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ నెల 17వ తేదీన రాజమండ్రి, కర్నూలు, 20వ విశాఖపట్టణం, 24వ తేదీన తిరుపతిలో ఈ అంశంపై ప్రాంతీయ సదస్సులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
శ్రీవారి మెట్ల మార్గంలో మరోమారు చిరుత కలకలం
తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత పులి సంచారం మరోమారు కలకలం సృష్టించింది. నడక దారిన వెళుతున్న కొంతమంది భక్తులు చిరుతను చూసినట్టు చూశారు. ఇది బాగా ప్రచారం కావడంతో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, తిరుమల అటవీ సిబ్బంది అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టారు.
మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లేలా అనుతించాలని నిర్ణయించారు. ఒంటరిగా వెళ్లే భక్తులపై చిరుత దాడి చేసే అవకాశం ఉండటంతో భద్రతా సిబ్బంది వాటర్ హౌస్ వద్ద భక్తులను నిలిపివేస్తున్నారు. అక్కడ నుంచి భక్తులు గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
మెట్ల దారి పక్కనే ఉన్న రోడ్డుపై చిరుత కనిపించిందని పులివెందులకు చెందిన భక్తులు తెలిపారు. వేగంగా రోడ్డు దాటుతున్న చిరుతను తాను చూసినట్టు చెప్పాడు. దీంతో వెంటనే ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకు సమాచారం చేరవేసినట్టు చెప్పారు.