శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (09:08 IST)

చంద్రబాబు గుండె సమస్యతో బాధపడుతున్నారు : హైకోర్టుకు వైద్యుల నివేదిక

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుండె సమస్యతో బాధపడుతున్నారని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణుల బృందం నివేదికను తయారు చేసింది. చంద్రబాబుకు ఇటీవల కంటి ఆపరేషన్‌తో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు కూడా జరిగాయి. వీటి వివరాలతో కూడిన నివేదికను వైద్యులు ఇవ్వగా, దాన్ని ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు మెమో ద్వారా దాఖలు చేశారు. 
 
"చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్ చేశాం. అనారోగ్య సమస్య నుంచి కోలుకునేందుకు మేము సూచించిన మందులను క్రమం తప్పకుండా వినియోగించాలి. కంటి పరీక్ష కోసం ఐదు వారాల షెడ్యూల్ ఇచ్చాం. ఆపరేషన్ చేసిన కంటికి ఐదు వారాలు ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ పరీక్షిస్తుండాలి. కంట్లో చుక్కల మందు వేసుకుంటుండాలి. చంద్రబాబు గుండె సమస్యతో బాధపడుతున్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో సమస్యలు ఉన్నాయి. తగినంత విశ్రాంతి అవసరం. మధుమేహాన్ని అదుపులో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలి" అని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు.