స్కిల్ కేసులో ఏఏజీ గైర్హాజరు... చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదాపడింది. శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణకు ఏఏజీ హాజరుకాలేదు. దీంతో విచారణను వాయిదా వేసింది.
ప్రస్తుతం ఆయనకు ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలై తన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే కేసులో ఆయన పూర్తి స్థాయి బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగాల్సివుండగా, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. ఏఏజీ నేడు విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టుకు తెలిపారు.
తమకు మరింత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.