బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (15:29 IST)

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు... రేపు నేత్ర పరీక్షలు

chandrababu
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు చర్మసంబంధిత వైద్య పరీక్షలను వైద్యులు చేస్తున్నారు. అలాగే, వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ఏఐజీ ఆస్పత్రిలో వైద్యులు చంద్రబాబుకు వివిధ రకాలైన వైద్య సేవలు చేసిన విషయం తెల్సిదే. ఇపుడు మరోమారు ఆయనకు వైద్య పరీక్షలు చేసి అందుకు తగిన విధంగా చికిత్స అందించనున్నారు. 
 
మరోవైపు, మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించుకోనున్నారు. మంగళవారం ఆయనకు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు నెల రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. 
 
ఆర్టీసీకి నిధుల కొరత.. మరమ్మతులు నిల్.. అందుకే ఈ ప్రమాదాలు : నారా లోకేశ్ 
 
విజయవాడ బస్టాండులో జరిగిన బస్సు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే, ఏపీ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీఎస్ ఆర్టీసీలో నిధులు లేవని, అందుకే బస్సులకు మరమ్మతులు చేయడం లేదని ఆరోపించారు. ఈ ప్రమాదంపై ఆయన స్పందిస్తూ, 
 
ఫ్లాట్‌ఫాంపైకి బస్సు దూసుకునికి వచ్చి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. కాలం చెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదన్నారు. 
 
నాలుగున్నరేళ్ళుగా ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టులు కూడా కొనుగోలు కూడా చేయలేని దుస్థితిలో ఆర్టీసీ సంస్థ ఉందన్నారు. రిక్రూట్మెమంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలుపుతున్నట్టు నారా లోకేశ్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు.