సంబంధిత వార్తలు
- వెనుక కూర్చొనివున్న మహిళ పట్ల క్రూరంగా ప్రవర్తించిన బైకర్ (Video)
- ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం.. మరో 8 గంటల్లోనే పొరుగింటి మహిళపై అత్యాచారం.. సైకోనా?
- సైకో వీరంగం.. హతమార్చిన గ్రామస్థులు...
- నువ్వు మనిషివా Mavigun సైకోవా? పేలుతున్న సెటైర్లు
- రోడ్డుకి అడ్డంగా వైఎస్సార్ విగ్రహాలు, తొలగిస్తున్న అధికారులు
వైఎస్సార్ విగ్రహం పైన దాడి చేసిన వ్యక్తి ఓ సైకో, సంయమనం పాటించండి
నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటరులో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహంపైన ఓ వ్యక్తి దాడి చేసాడు. ఓ రాయిని తీసుకుని విగ్రహం ముఖంపైన, మెడపైన కొడుతూ ధ్వంసం చేసే ప్రయత్నం చేసాడు. ఇదంతా అక్కడే వున్న పలువురు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోను చూసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆమె x లో స్పందిస్తూ... మహానేత, దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం. కూటమి పార్టీలైన తెదేపా, జనసేన, భాజపా ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటు.
ఇది చంద్రబాబు గారి రాజకీయ కక్షకు నిదర్శనం. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహం ధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టపగలు ఓ సైకో విగ్రహంపై దాడి చేస్తుంటే పోలీసులు ఉండి కూడా ఆపకపోవడం హేయమైన చర్య. మానసిక స్థితి బాగోలేదని, మనిషే కాదని, సంయమనం పాటించాలని ఉచిత సలహాలు ఇవ్వడం పోలీసు యంత్రాంగానికి తగదు.
కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సైకో వెనుక ప్రభావిత శక్తులు ఎవరున్నారో తేల్చాలి. పాత విగ్రహం స్థానంలో తక్షణం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి. రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వమే భాద్యత వహించాలి. వెంటనే వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నంద్యాలలో అదే సెంటర్ వద్ద ఆమరణ దీక్షకు దిగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ వెల్లడించారు.
