1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSR Statues Blocking Road; Officials Removing Them

రోడ్డుకి అడ్డంగా వైఎస్సార్ విగ్రహాలు, తొలగిస్తున్న అధికారులు

YSR Statue removing
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎటుచూసినా నున్నటి రోడ్లు కనబడుతున్నాయి. ఎలాంటి గతుకులు లేని రోడ్లపై వాహనదారులు హాయిగా వెళ్లిపోతున్నారు. ఐతే కొన్నిచోట్ల పంటికింద రాయిలా ట్రాఫిక్ కష్టాలను పలువురి నాయకుల విగ్రహాలు అడ్డుపడుతున్నాయి. కొన్ని కట్టడాలు కూడా ఇబ్బందులుపెడుతున్నాయి.
 
గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ విగ్రహాలు చాలాచోట్ల ప్రతిష్టించారనీ, అవి ట్రాఫిక్ కష్టాలను కలిగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రోడ్డుకు అడ్డుగా వున్న విగ్రహాలను తొలగిస్తున్నారు. ఐతే పెందుర్తి, విశాఖ, ప్రకాశం వంటి ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలు రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుగా వున్నాయనీ, వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి విగ్రహాలను ఇంటివద్ద పెట్టుకోవాలని, రోడ్డుకి అడ్డంగా పెట్టడం సరికాదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
వీడియో లైక్స్ కోసం నాగుపామును నాలుకపై ఆడించాడు, కాటు వేయడంతో మృతి, వీడియో