శ్రీ వేంకటేశ్వర వర్శిటీ క్యాంపస్‌లో చిరుతపులి.. విద్యార్థుల్లో భయం భయం
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఐ, జీ బ్లాకుల మధ్య చిరుతపులి కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యార్థులు సంబంధిత అధికారులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే ఆ చిరుతపులి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. విశ్వవిద్యాలయ ప్రాంగణం శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో, ఇక్కడ అడవి జంతువులు కనిపించడం సాధారణమే.
గత ఏడాది అటవీ శాఖ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మూడు చిరుతపులులను పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. క్యాంపస్‌లోకి అడవి జంతువుల రాకను అరికట్టడానికి అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, తాజాగా మరో చిరుతపులి కనిపించడంతో క్యాంపస్‌లో వున్న వారిలో ఆందోళన నెలకొంది.
తర్వాతి కథనం
