సంబంధిత వార్తలు
- వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)
- దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్లో కొట్టుకున్న భక్తులు.. (Video)
- దేవాన్ష్ పుట్టిన రోజు - తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు
- TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే
- తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త.. సిఫార్సు లేఖలతో ప్రత్యేక దర్శన స్లాట్స్
ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఈ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుక, 30వ తేదీన ఉగాది పర్వదిన వేడుకలు జరుగనున్నాయి. దీంతో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.
ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందుకు 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం జరగదని స్పష్టంచేసింది. తెంలగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23వ తేదీన స్వీకరించి 24వ తేదీన దర్శనానికి అనుమతించనున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది.
