శుక్రవారం, 21 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 మార్చి 2025 (20:41 IST)

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

Chandra Babu
Chandra Babu
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం శుక్రవారం తిరుమల ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి తిరుమలలోని అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు భోజనం వడ్డించారు. 
 
చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి పక్కపక్కనే కూర్చుని ఒకే వడను పంచుకున్నప్పుడు, విశేష దృష్టిని ఆకర్షించిన ఒక ఆసక్తికరమైన క్షణం జరిగింది. భువనేశ్వరి వడను రెండుగా చేసి, ఒక సగం తిని, మిగిలిన సగం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.