1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Undavalli Arun Kumar Sensational Comments On Chandrababu

చంద్రబాబు లాంటి అబద్ధాల సీఎంను నేనెప్పుడూ చూడలేదు: ఉండవల్లి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు లాంటి అబద్ధాల సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. డిసెంబర్‌ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం లేని పుర

Undavalli Arun Kumar
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు లాంటి అబద్ధాల సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. డిసెంబర్‌ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం లేని పురుషోత్త పట్నం ప్రాజెక్టును ఆగస్ట్‌లోనే జాతికి అంకితం ఇచ్చిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు ద్వారా మోడీ సాధించినదేమీ లేదని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలే నిరూపిస్తున్నాయని ఉండవల్లి తెలిపారు.
 
ఉప ఎన్నికల్లో టీడీపీ ఓటుకు రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఖర్చు చేసిందని.. వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాగే చేసి ఆయన అధికారంలోకి రావాలని భావిస్తున్నానని తెలిపారు. సాధారణ ఎన్నికలకు ఉఫ ఎన్నికలకు తేడా ఉంటుందని.. ఇప్పటి జిమ్మిక్కులు అప్పుడు పని చేయవని ఉండవల్లి విశ్లేషించారు. నదుల అనుసంధానం దేశంలో తానే చేశానని చంద్రబాబు మాట్లాడటంలో అర్థం లేదన్నారు. 
 
పట్టిసీమ విషయంలో ఎత్తిపోతల పథకాలు మాత్రమేనని కేంద్రం క్లారిటీ ఇచ్చినా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఉండవల్లి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా ఇచ్చారు.
About Writer
selvi
తర్వాతి కథనం
ఇంగ్లీష్ చక్కగా మాట్లాడినా చితక్కొడుతారు... ఎక్కడ?