మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (18:34 IST)

మూడవ విడత ఋణ మాఫీ రెడీ... 10% వడ్డీతో కలిపి జమ... మంత్రి సోమిరెడ్డి

గౌరవ ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం ఋణ ఉపశమన పధకం క్రింద మొదటి విడత 54.98 లక్షల రైతుల ఖాతాలకు రూ.7564.69 కోట్లు జమ చేయడం జరిగిందని, రూ.50,000 లోపు ఋణ ఉపశమనం అర్హత కలిగిన రైతులకు ఇందులో 23.76 లక్షల ఖాతాలకు రూ.4,493 కోట్లు జమ చేయడం జరిగింద

గౌరవ ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం ఋణ ఉపశమన పధకం క్రింద మొదటి విడత 54.98 లక్షల రైతుల ఖాతాలకు రూ.7564.69 కోట్లు జమ చేయడం జరిగిందని, రూ.50,000 లోపు ఋణ ఉపశమనం అర్హత కలిగిన రైతులకు ఇందులో 23.76 లక్షల ఖాతాలకు రూ.4,493 కోట్లు జమ చేయడం జరిగిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. అలాగే రూ.50,000 పైబడి రూ.1,50,000 లోపల ఋణ ఉపశమన అర్హత కల్గిన 31.22 లక్షల రైతుల ఖాతాలకు మొదటి వాయిదా రూ.3071.69 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.
 
రెండవ విడత 36.39 లక్షల రైతుల ఖాతాలకు రూ.3300 కోట్లు విడుదల చేయడం జరిగిందని, దశల వారీగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 44 వేల అర్హత కలిగిన రైతు ఖాతాలకు రూ.96.25 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.
 
ముడో విడత వాయిదా క్రింద రూ.3600 కోట్లను 10% వడ్డీతో కలిపి బడ్జెట్‌లో పొందుపరిచి దీనిలో రూ.1000 కోట్లను రైతు సాధికార సంస్థ PD ఖాతాకు జమ చేయటమైనదని తెలిపారు. రూ.1600 కోట్లను త్వరలో విడుదల చేస్తున్నామని, ఈ నెల 10వ తేది నుండి సెప్టెంబర్ 30 లోపల 31.22 లక్షల రైతుల ఖాతాలకు ముడో విడత జమ చేయటం జరుగుతుందని మంత్రి  తెలిపారు.