గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (07:11 IST)

తెలుగు టెక్కీకి "మిస్‌ ఇండియాసౌతాఫ్రికా" కిరీటం

ఇటీవల మిస్ ఇండియా - సౌతాఫ్రికా గాటెంగ్ టైటిల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలుగు టెక్కీ విజయం సాధించింది, టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

ఇటీవల మిస్ ఇండియా - సౌతాఫ్రికా గాటెంగ్ టైటిల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలుగు టెక్కీ విజయం సాధించింది, టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అద్దేపల్లి శ్రీశుభ (25) అనే యువతి పాల్గొంది. ఈమె దక్షిణాఫ్రికాలో ప్రముఖ బ్యాంకులో ఐటీ స్పెషలిస్టుగా పని చేస్తోంది. వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. 
 
కాగా, ఈ టైటిల్ పోటీల్లో శ్రీశుభ అన్ని విభాగాలతోపాటు డ్యాన్స్‌లో కూడా అద్వితీయమైన ప్రతిభ కనబరిచి జ్యురీ ప్రశంసలు పొందారు. భారత్‌లో పుట్టిన యువతి మిస్‌ ఇండియా దక్షిణాఫ్రికాను గెలుచుకోవడం ఇది రెండోసారి. 2009లో టైటిట్‌ గెలుచుకున్న ఆయుషి చాబ్రా న్యూయార్క్‌లో ప్రముఖ మోడల్‌, నటిగా పేరుగాంచిన విషయం తెల్సిందే.