తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తమిళనాడు గవర్నర్‌గా మోత్కుపల్లి?
రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్లను నియమించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులోభాగంగా, పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ముఖ్యంగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్ల
రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్లను నియమించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులోభాగంగా, పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ముఖ్యంగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనను తమిళనాడు ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రానికి ప్రస్తుతం తాత్కాలిక గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్ రావు కొనసాగుతున్నారు.
కాగా, కొత్త గవర్నర్ల నియామకంలో భాగంగా, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాదార్ అండ్ నాగర్ హవేలీకి గవర్నర్లు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది.
ప్రస్తుతం కేంద్రమంత్రులుగా ఉన్న కొందరిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపాలని యోచిస్తోంది. కల్‌రాజ్ మిశ్రా, లాల్జీ టాండన్, విజయ్‌కుమార్ మల్హోత్రా, కైలాస్ జోషీ, ఆనందీబెన్ పటేల్, మోత్కుపల్లి నర్సింహులు, సీపీ ఠాకూర్, జితిన్ రామ్ మాంఝీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే, మోత్కుపల్లికి ఈ దఫా గవర్నర్ గిరీ ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం.