మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 6 సెప్టెంబరు 2017 (22:03 IST)

శారదా నదికి సీఎం బాబు హారతి

విశాఖపట్నం: జలసిరి-హారతి కార్యక్రమంలో భాగంగా కశింకోట మండల నరసాపురం ఆనకట్టను ప్రారంభించేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. వుడా వి.సి బసంత్ కుమార్, జీవీఎంసీ కమీషనర్, శాసన సభ్యు

విశాఖపట్నం: జలసిరి-హారతి కార్యక్రమంలో భాగంగా కశింకోట మండల నరసాపురం ఆనకట్టను ప్రారంభించేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. వుడా వి.సి బసంత్ కుమార్, జీవీఎంసీ కమీషనర్, శాసన సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
జలసిరికి సీఎం హారతి...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శారదా నదిపై నరసాపురం వద్ద నిర్మించిన ఆనకట్ట వద్ద బుధవారం జలసిరికి-హారతినిచ్చారు. జలసిరికి-హారతి కార్యక్రమంలో భాగంగా కశింకోట మండలంలోని శారదా నదిలో హారతినిచ్చేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి సింహాచలం దేవస్థానానికి చెందిన వేద పండితులు పూర్ణకుంభం స్వాగతంతో మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ఆనకట్ట పనులను, నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూజలు చేసి పుష్పాలతో జలానికి అభిషేకించారు.