సంబంధిత వార్తలు
- తాలిబన్‌ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్: ఇక సెక్స్ బానిసలుగా మహిళలు... అంటున్నదెవరంటే?
- తాలిబన్లు ముమ్మాటికీ ఉగ్రవాదులే : నిషేధించిన ఫేస్బుక్
- కాబూల్ నగరంలోకి అడుగుపెట్టిన తాలిబన్ తీవ్రవాదులు
- ఒక మతానికే డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న
- బిజెపి-వైసిపి రహస్య డీల్? ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్?
తాలిబన్లలా తయారైన వైసీపీ నేతలు: నక్కా ఆనంద్ విమర్శ
తాలిబన్‌ల మాదిరిగా వైసీపీ నేతలు ఏపీలో పని చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. తాము కూడా అధికారంలో ఉన్నామని...ఏ రోజు పోలీసు సిబ్బందితో ఇలాంటి పనికిమాలిన పనులు చేయించలేదని అన్నారు.
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైనే దాడులు చేస్తుంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మేరుగ నాగార్జున అట్రాసిటీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
అట్రాసిటీ చట్టం ఎత్తివేయించేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. గాలివాటంగా వచ్చిన నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు పరామర్శిస్తుంటే వైసీపీ నేతలను పోలీసుల ఎలా తీసుకువస్తారని నిలదీశారు. అధికార పార్టీ నేతల వద్ద మార్కులు కోసం పోలీసులు పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో పేకాట , గుట్కా, మద్యం విచ్చలవిడిగా సాగుతుందని తెలిపారు. జిల్లా పోలీసుల అధికారుల అవినీతిలో కూరుకపోయారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి పోలీసు వచ్చి పేకాట శిబిరాలపై దాడులు చేయడం జిల్లా పోలీసులకు సిగ్గు చేటన్నారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని, ఈ పోలీసు అధికారులను ఏ సజ్జల వచ్చి కాపాడతాడో చూస్తామని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు.

తర్వాతి కథనం