1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ycp mla roja intersting comments on nivar cyclone

సీఎం జగన్ వల్లే నివర్ తుఫాన్ ముప్పు నుంచి తప్పించుకున్నాం: రోజా

ycp mla roja
నివర్ తుఫాన్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ వల్లే అతిపెద్ద తుఫాను నుంచి తప్పించుకోగాలిగామని రోజా పేర్కొన్నారు. అంతేకాదు ఇంకో రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయని.. వీటి పైనే సీఎం జగన్ సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. 
 
వరదల వల్ల ప్రజలు నష్టపోయారని తెలిసిన వెంటనే ఏరియల్ సర్వే చేశారని.. వరదల వల్ల నష్టపోయిన రైతులందరికీ డిసెంబర్ 31 లోగా నష్టపరిహారం వారి ఎకౌంట్లలో వేస్తారని హామీ ఇచ్చారు రోజా. వరద నష్టం పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పుకొచ్చారు. 
 
కాగా నివర్‌ తుఫాన్‌ ఏపీలో విధ్వంసం సృష్టించింది. తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. 
 
నేషనల్ హైవే పైకి వర్షపు నీరు రావడంతో నెల్లూరులో ట్రాఫిక్‌ జామ్ అయింది. తుఫాను కారణంగా నెల్లూరు, చిత్తూరులో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుమలలో కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
నివర్ తుఫాన్‌లో మరణించిన వారికి రూ. 5 లక్షలు: ఉపముఖ్యమంత్రి బాషా