గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (13:42 IST)

నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వరదనీరు..

తిరుమల శ్రీవారి ఆలయ ముందుకు నీళ్ళు రావాలంటే అది సాధ్యం కాదు. కానీ నివర్ ఎఫెక్ట్‌తో తిరుమల గిరుల్లో వరదనీరు పొంగిపొర్లుతోంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి తిరుమలలోని డ్యాములన్నీ నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎండిపోయిన చెట్లు పచ్చగా భక్తులకు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
 
అయితే తిరుమల శ్రీవారి ఆలయం ముందు వరదనీరు నిలిచిపోయింది. దీంతో టిటిడి సిబ్బంది ఆ వరద నీటిని మిషన్ల సహాయంతో ఆలయానికి దూరంగా పంపింగ్ చేస్తున్నారు. రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో టిటిడి సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
 
ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న భక్తులకు అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్దే జాగ్రత్తలు చెబుతున్నారు. వర్షం పడుతుండటంతో నెమ్మదిగా వెళ్ళాలని సూచిస్తున్నారు. మోటారు సైకిళ్లపై వెళుతున్న వారినైతే మరింత నెమ్మదిగా వెళ్ళాలని సూచనలిస్తున్నారు టిటిడి సిబ్బంది. అయితే శ్రీవారి ఆలయం ముందుకు వరదనీరు రావడం మాత్రం చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడే వచ్చిందని టిటిడి అధికారులు చెబుతున్నారు.