సంబంధిత వార్తలు
- క్రికెట్ బెట్టింగ్ కేసులో దొరికిపోయిన వైసీపీ ఎమ్మెల్యే
- వైకాపాలోకి కాటసాని రాంభూపాల్ రెడ్డి.. కండువా కప్పిన జగన్
- వైకాపాలోకి కన్నబాబు.. టీడీపీలోకి శత్రుచర్ల చంద్రశేఖర రాజు.. వైఎస్సార్ సన్నిహితుడు..?
- అమిత్ షా వార్నింగ్.. బీజేపీ నేతలకు షాక్.. జగన్‌కు అల్టిమేటం
- వైసీపీ తీరు ఎలా వుందంటే..? నారా లోకేష్ ఎద్దేవా
స్నేహితుడి భార్యపై లాడ్జిలో లైంగికదాడికి యత్నం.. వైకాపా నేత అరెస్ట్
గుంటూరు జిల్లా వైకాపా నాయకుడు, మాచర్ల మాజీ ఎంపీపీ రమావత్ నర్సింగ్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించడంతో రమావత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మాచర
గుంటూరు జిల్లా వైకాపా నాయకుడు, మాచర్ల మాజీ ఎంపీపీ రమావత్ నర్సింగ్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించడంతో రమావత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన రమావత్ నర్సింగ్ నాయక్ గతంలో వైకాపా తరపు వైసీపీ తరపున మాచర్ల ఎంపీపీగా పనిచేశారు.
అదే గ్రామంలో వైకాపాకు చెందిన ఓ వ్యక్తి నాయక్‌కు బాల్య స్నేహితుడు. రెండు కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు ఉన్నాయి. తాడేపల్లి మండలానికి చెందిన మహిళతో నాయక్ స్నేహితుడికి వివాహం అయ్యింది. ఇరు కుటుంబాల మధ్య స్నేహబంధం వుండటంతో గత నెల 27న తమ స్వగ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లే నిమిత్తం నర్సింగ్ నాయక్‌తో కలిసి ఆమె అచ్చమ్మకుంట నుంచి బయలుదేరింది.
గుంటూరులోని హిందూకళాశాల వద్ద వారు బస్సు దిగారు. హోటల్‌లో భోజనం చేసి వెళదామని ఆమెకు నర్సింగ్ నాయక్ చెప్పాడు. కానీ, అక్కడి రైల్వేస్టేషన్ రోడ్డులోని లాడ్జి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించడంతో ఆమె ప్రతిఘటించింది.
ఇంటికెళ్లాక ఈ విషయాన్ని బాధితురాలు భర్తకు తెలియజేసింది. దీంతో ఈ నెల 1న రమావత్ నర్సింగ్ నాయక్‌పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.
