సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: గురువారం, 3 మే 2018 (12:03 IST)

క్రికెట్ బెట్టింగ్ కేసులో దొరికిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసు నమోదు చేసింది ఏసీబీ. క్రికెట్ బుకీలతో సంబంధాలు, బెట్టింగ్ గ్యాంగ్‌లకు అండగా నిలిచారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రధాన బుకీ కృష్ణ సింగ్ అనుచరులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ప

వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసు నమోదు చేసింది ఏసీబీ. క్రికెట్ బుకీలతో సంబంధాలు, బెట్టింగ్ గ్యాంగ్‌లకు అండగా నిలిచారని ఎమ్మెల్యే  శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రధాన బుకీ కృష్ణ సింగ్ అనుచరులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి పలుమార్లు విజయవాడలోని హోటళ్లలో  సమావేశమైనట్టు గుర్తించిన పోలీసులు, హోటల్ బిల్లులు, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరించారు.
 
ప్రధాన బుకీ కృష్ణ సింగ్ కొన్నాళ్ళు దాక్కోవటానికి, కోర్టులో లొంగిపోవటానికి కోటంరెడ్డి సహకరించారని పోలీసులు నిర్థారణ చేసుకున్నారు. ప్రతిఫలంగా 23 లక్షల రూపాయలు ఎమ్మెల్యే కోటంరెడ్డికి విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా క్రికెట్ బుకీ కృష్ణ సింగ్ అందచేసినట్టు పోలీసులు గుర్తించారు.