ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:41 IST)

దోషిగా ఆశారాం బాపు : నన్ను చంపేస్తారంటున్న ప్రధాన సాక్షి

తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్

తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, దోషులకు శిక్షలను ఖరారు చేయాల్సి వుంది.
 
ఇదిలావుంటే, ఈకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మహేంద్ర చావ్లా మాత్రం ప్రాణభయంతో వణికిపోతున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ భయం గుప్పెట్లో ఉన్నారు. తనకు కూడా మిగతా సాక్షుల మాదిరిగానే అదనపు భద్రత కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 
 
ఆశారాం బాపూ మాజీ అనుచరుడైన మహేంద్ర చావ్లా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 'నాకు భద్రత ఉన్నప్పటికీ... అదనపు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. ఈ కేసులో మిగతా సాక్షుల్లాగే నాక్కూడా ప్రాణహాని ఉంది..' అని ఆందోళన వ్యక్తం చేశాడు.