1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Asaram Bapu verdict today: Security beefed up in 3 states

నేడు ఆశారాం బాపు రేప్ కేసులో తుదితీర్పు .. 4 రాష్ట్రాల్లో రెడ్‌అలెర్ట్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు రేప్ కేసులో జోధ్‌పూర్ కోర్టు బుధవారం తుదితీర్పును వెలువరించనుంది. దీంతో నాలుగు రాష్ట్రాల్లో రెడ్‌అలెర్ట్‌ను ప్రకటించారు. అలాగే, బాధితురాలి ఇంటివద్ద కూడా భారీ స

Asaram Bapu verdict today
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు రేప్ కేసులో జోధ్‌పూర్ కోర్టు బుధవారం తుదితీర్పును వెలువరించనుంది. దీంతో నాలుగు రాష్ట్రాల్లో రెడ్‌అలెర్ట్‌ను ప్రకటించారు. అలాగే, బాధితురాలి ఇంటివద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.
 
ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రంలోని జోథ్‌పూర్ సమీపంలో ఉన్న మనాయి ఆశ్రమంలో 2013లో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. దీనిపై బాధిత బాలిక కేసు నమోదు చేయగా, ఆశారాం బాపును అరెస్టు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ అనంతరం నేడు జోథ్‌పూర్ కోర్టు తీర్పు వెలువరించనుంది. 
 
ఇకపోతే, ఆశారాంకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఫాలోయింగ్ ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో రాజస్థాన్, గుజరాత్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రెడ్‌అలెర్ట్ ప్రకటించారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది. మరోవైపు బాధిత బాలిక కుటుంబం ఇంటి వద్ద షహరాన్‌పూర్ జిల్లా యంత్రాంగం భారీగా బలగాలను మోహరించింది. 
About Writer
pnr
తర్వాతి కథనం
పవన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.. లేదంటే ఆ చర్యలు తప్పవ్: ఆర్కే వార్నింగ్