శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (12:07 IST)

భారతీయులు క్రమశిక్షణతో వుంటారు.. కానీ పాకిస్థానీయులు?: గల్ఫ్ ఖల్ఫాన్

దుబాయ్‌లోకి పాకిస్థాన్ భారీగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తోందని ఎమిరేట్స్ అత్యున్నత భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఫలితంగా పాకిస్థాన్‌తో గల్ఫ్‌కు పెను ప్రమాదం పొంది వుందని ఎమిరేట్స్ భద్రతాధికారి తెల

దుబాయ్‌లోకి పాకిస్థాన్ భారీగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తోందని ఎమిరేట్స్ అత్యున్నత భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఫలితంగా పాకిస్థాన్‌తో గల్ఫ్‌కు పెను ప్రమాదం పొంది వుందని ఎమిరేట్స్ భద్రతాధికారి తెలిపారు. భారీగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గల్ఫ్ కమ్యూనిటీకి పెను ప్రమాదంగా మారే అవకాశం వుందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
దుబాయ్‌లో భద్రతాధికారులు పలు డ్రగ్స్ రాకెట్ ముఠాలను అదుపులోకి తీసుకోగా.. ఆ ముఠాల్లో అత్యధిక శాతం పాకిస్థాన్‌కు చెందినవే కావడంతో ఎమిరేట్స్ భద్రతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జనరల్ సెక్యూరిటీ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖల్ఫాన్ ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారతీయులు చాలా క్రమశిక్షణతో ఉంటారని, కానీ పాకిస్థానీల వల్ల దేశం ప్రమాదంలో పడిందని లెఫ్టినెంట్ జనరల్ పేర్కొన్నారు.  ఉద్యోగాల పేరిట గల్ఫ్ దేశానికి వచ్చే పాకిస్థానీయులు.. నేరాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. 
 
పాకిస్థాన్‌తో గల్ఫ్‌కు పెను ప్రమాదం వుందని.. మాదక ద్రవ్యాలను పాక్ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారని ట్వీట్ చేశారు. ఇంకా డ్రగ్స్‌తో పట్టుబడిన ముగ్గురు పాకిస్థానీయుల ఫోటోను కూడా పోస్టు చేశారు. ఇక పాకిస్థానీలకు ఉద్యోగాలను ఇవ్వడం ఆపేయాలని ఖల్ఫాన్ ఆదేశించినట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.