బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (10:55 IST)

బాలిక రేప్ కేసులో ఆశారాం బాపు దోషి.. జోథ్‌పూర్ కోర్టు తీర్పు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు రేప్ కేసులో దోషిగా తేలారు. ఈ మేరకు జోధ్‌పూర్ కోర్టు బుధవారం తుదితీర్పును వెలువరించింది. దీంతో నాలుగు రాష్ట్రాల్లో రెడ్‌అలెర్ట్‌ను ప్రకటించారు. అలాగే, బాధితురాల

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు రేప్ కేసులో దోషిగా తేలారు. ఈ మేరకు జోధ్‌పూర్ కోర్టు బుధవారం తుదితీర్పును వెలువరించింది. దీంతో నాలుగు రాష్ట్రాల్లో రెడ్‌అలెర్ట్‌ను ప్రకటించారు. అలాగే, బాధితురాలి ఇంటివద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.
 
ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రంలోని జోథ్‌పూర్ సమీపంలో ఉన్న మనాయి ఆశ్రమంలో 2013లో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. దీనిపై బాధిత బాలిక కేసు నమోదు చేయగా, ఆశారాం బాపును అరెస్టు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ అనంతరం నేడు జోథ్‌పూర్ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో ఆశారాం బాపుతో సహా మొత్తం ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
మరోవైపు, ఆశారాంకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఫాలోయింగ్ ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీచేయడంతో రాజస్థాన్, గుజరాత్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో బలగాలను మొహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.