ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాలు విడుదల- కృష్ణా జిల్లా టాప్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సెకండియర్ పరీక్షాఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,42,381 మంది విద్యార్థులు ఇంటర్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సెకండియర్ పరీక్షాఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,42,381 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు. ఈసారి పరీక్ష ఫలితాలు టీవీలో చూసే వినూత్న అవకాశాన్ని ఏపీ సర్కార్ కల్పించింది.
రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను టీవీలో నేరుగా ప్రసారం చేస్తుండగా.. ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన సూచీ కనిపిస్తుందని.. దీనిపై రిమోట్‌తో ప్రెస్ చేసి.. హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే విద్యార్థికి సంబంధించిన రిజల్ట్ టీవీ తెరపై కనిపిస్తుంది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫైబర్ నెట్ అనేది చాలా వరకు లేదు. కాబట్టి ఇంటర్నెట్ కేఫ్, మొబైల్ ఫోన్స్‌లో మాత్రమే చూసుకోవడానికి అవకాశముంటుంది. కాగా శుక్రవారం రోజున వైజాగ్‌లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు మంత్రి గంటా ప్రకటించారు.
కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను గురువారం రాజమహేంద్ర వరం నుంచి ఆంధ్రప్రదేశ్ మనవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 77 శాతంతో ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నెల్లూరు జిల్లా, 76 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో గుంటూరు జిల్లాలు నిలిచాయి. 59 శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మొత్తం 44 వెబ్‌సైట్‌లలో ఫలితాలు లభ్యమవుతాయని గంటా ప్రకటించారు.
ఇకపోతే.. ఎంపీసీలో 992 మార్కులతో మొదటి స్థానంలో విద్యార్థి కూనం తేజ వర్ధనరెడ్డి నిలవగా, రెండో స్థానంలో 991 మార్కులతో ఆఫ్రాన్ షేక్, మూడో స్థానంలో 990 మార్కులతో వాయలపల్లి సుష్మా నిలిచారు.