అమిత్ షా వార్నింగ్.. బీజేపీ నేతలకు షాక్.. జగన్‌కు అల్టిమేటం
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్కరినీ పార్టీలో చేర్చుకోవద్దంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు షాక్ అయ్యారు.
తద్వారా ఏపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలకు ఆ పార్టీ హైకమాండ్ అడ్డుకట్ట వేసినట్టయింది. ఈ నేపథ్యంలో, కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడం ఆగిపోయింది. అమిత్ షా చేసిన ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్‌తో అంతా సెట్ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది.
పార్టీలో చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన అమిత్ షా... బీజేపీలోనే ఉండాలని కోరారు. దీంతో, ఆయన మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు.